ఆర్‌టిఐ కమిటీ సభ్యుల నియామకానికి దరఖాస్తుల స్వీకరణ

02-10-2026 | 04:11pm

కలెక్టర్ కుమార్ దీపక్ 

నస్పూర్, (విజయక్రాంతి): సమాచార హక్కు చట్టం–2005ను(Right to Information Act) జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయడం, సమాచార హక్కు చట్టం అమలుకు సంబంధించి జిల్లా స్థాయిలో సమన్వయం, పర్యవేక్షణ, అమలు ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లా స్థాయి సమన్వయ కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(Collector Kumar Deepak) శుక్ర వారం తెలిపారు. ఈ కమిటీలో ఇద్దరు ఆర్‌టిఐ కార్యకర్తలను నామినేషన్ రోటేషన్ పద్ధతిలో సభ్యులుగా ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు.

జిల్లాకు చెందిన ఆసక్తి, అర్హత కలిగిన ఆర్‌టిఐ కార్యకర్తలు జిల్లా స్థాయి సమన్వయ కమిటీలో సభ్యులుగా సేవలందించేందుకు తమ దరఖాస్తులను కలెక్టరేట్ లోని ప్రజా సమాచార అధికారి / జిల్లా రెవెన్యూ అధికారి కార్యాలయంలో ఈ నెల 6 లోగా వ్యక్తిగతంగా సమర్పించవలసి ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలు, సూచనలకు అనుగుణంగా ఇద్దరు ఆర్‌టిఐ కార్యకర్తలను కమిటీ సభ్యులుగా నామినేట్ చేయడం జరుగుతుందని, జిల్లాలోని ఆర్‌టిఐ కార్యకర్తలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని నిర్ణీత గడువులోగా తమ దరఖాస్తులను సమర్పించాలని కోరారు.

మరిన్ని వార్తలు