ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
కొడిమ్యాల, అక్టోబర్ 2 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను(Gandhi Jayanti Celebrated) పట్టణ ఆర్యవైశ్య సంఘం(Arya Vysya Sangham) ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మా గాంధీ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు,ఐక్య సంఘం ప్రధాన కార్యదర్శి కొండూరి సురేష్,సర్పంచ్ జీవన్ రెడ్డి, ఉప సర్పంచ్ గుర్రం నరసయ్య,కాంగ్రెస్ మండల అధ్యక్షులు నాగభూషణ్ రెడ్డి,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొండూరి రాజేష్, వైశ్య సంఘం ఉపాధ్యక్షులు కొంజర్ల రవీందర్,సంఘ సభ్యులు,నాయకులు, తదితరులు పాల్గొన్నారు.