తెల్లవారుజామునే పారిశుద్ధ్య పనులపై చైర్మన్ సమీక్ష
- మంచినీటి పైప్లైన్కు తక్షణ మరమ్మతులు
- మున్సిపల్ చైర్మన్ మలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్)
హుజురాబాద్, అక్టోబర్ 27 (విజయక్రాంతి): జమ్మికుంట పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజలకు తాగునీటి సరఫరాపై మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్(Municipal Chairman Molugu Prashanth Kumar Dileep) ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకే పారిశుద్ధ్య కార్మికులు, శానిటేషన్ ఇన్స్పెక్టర్, జవాన్లతో సమావేశమై పట్టణంలోని పారిశుద్ధ్య పనులపై సమీక్ష నిర్వహించారు.
పారిశుద్ధ్య కార్మికులు సమయపాలన పాటిస్తూ సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. పట్టణ ప్రజలందరితో మమేకమై పనిచేయాలని, పట్టణం మొత్తం మన కుటుంబమనే భావనతో బాధ్యతగా విధులు నిర్వర్తించాలని తెలిపారు.
జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 8వ వార్డు మారుతినగర్లో దెబ్బతిన్న మంచినీటి పైప్లైన్కు తక్షణమే మరమ్మతులు చేపట్టారు తాగునీటి సరఫరాలో అంతరాయం కలగకుండా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ కొలుగూరి సురేష్, శానిటరీ ఇన్స్పెక్టర్ రమేష్, మంచినీటి సరఫరా సిబ్బంది పాల్గొన్నారు.