హనుమకొండలో వారాహి లక్ష్మి సిల్క్స్ ప్రారంభం
06-10-2026 | 12:22am
హనుమకొండ, అక్టోబర్ 5 (విజయక్రాంతి): హనుమకొండలో నూతనంగా ఏర్పాటు చేసిన వారాహి లక్ష్మి సిల్క్స్(Varahi Lakshmi Silks) వస్త్ర దుకాణాన్ని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వారాహి లక్ష్మి సిల్క్స్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా ఏర్పాటు చేసిన సంస్థ ప్రజలకు నాణ్యమైన వస్త్రాలను అందిస్తూ మంచి ఆదరణ పొందాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు ఈవీ శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ తోట వెంకటేశ్వర్లు, వేముల శ్రీనివాస్, యువజన నాయకులు తోట పవన్ తదితరులు పాల్గొన్నారు.