రైతులకు దీపావళి కానుకగా పాల క్యాన్ల పంపిణీ

04-11-2026 | 12:06pm

భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండలం(Bhikkanoor mandal) కంచర్ల గ్రామంలో కరీంనగర్ డెయిరీ(Karimnagar Dairy) ఆధ్వర్యంలో పాడి రైతులకు(Farmers) దీపావళి కానుకగా పాల క్యాన్లను పంపిణీ(Distribution of milk cans) చేశారు. పాడి రైతులను ప్రోత్సహించడంతో పాటు వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కామారెడ్డి మేనేజర్ పడకంటి సాయికుమార్, సూపర్‌వైజర్ బొట్ల ప్రవీణ్, డెయిరీ ప్రెసిడెంట్ పెంటల శ్రీనివాస్ గౌడ్, డైరెక్టర్లు పాల్గొన్నారు. రైతుల సంక్షేమమే డెయిరీ ముఖ్య లక్ష్యమని, భవిష్యత్తులో మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తామని మేనేజర్ తెలిపారు.

మరిన్ని వార్తలు