నంది వాడలో వైభవంగా శోభ యాత్ర..
22-09-2026 | 06:54pm
తాడ్వాయి, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) నందివాడ, కృష్ణాజివాడి గ్రామాలలో మంగళవారం గణనాథుల శోభాయాత్రలు వైభవంగా నిర్వహించారు. అందంగా అలంకరించిన వాహనాలలో గణనాథులను ఉంచి వాహనాల ముందు యువకులు నృత్యాలు చేస్తూ అందరిని అలగించారు. పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ ముందుకు సాగారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డోలు బాజాల మధ్య గణనాథుల శోభయాత్ర సాగింది. గ్రామాల్లోని ప్రధాన వీధుల గుండా శోభయాత్రను నిర్వహించారు. అనంతరం రాత్రి గణనాథుల నిమజ్జనం నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు.