టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడికి సన్మానం

23-10-2026 | 08:16pm

కామారెడ్డి, అక్టోబర్ 23 (విజయక్రాంతి): తెలంగాణ రక్షణ సేన(Telangana Rakshana Sena) ( టి ఆర్ ఎస్ ) జిల్లా అధ్యక్షుడిగా గైని శ్రీనివాస్ గౌడ్(Gaini Srinivas Goud) ఎన్నిక కావడంతో శుక్రవారం సదాశివనగర్ మండల తెలంగాణ రక్షణ సేన అధ్యక్షుడు కలాలి సాయగౌడ్  ఆధ్వర్యంలో కామారెడ్డి లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సాయగౌడ్ మాట్లాడుతూ గైని శ్రీనివాస్ గౌడ్  రాజకీయంగా  అంచెలంచలుగా ఎదగాలన్నారు.

అనంతరం జిల్లా టిఆర్ఎస్ యువజన విభాగం జనరల్ సెక్రెటరీ జొన్నల రాము, సోషల్ మీడియా(Social Media) జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన వినోద్ లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో సోషల్ మీడియా ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంచార్జి మోసర్ల శ్రీకాంత్ రెడ్డి, తాడ్వాయి మండల అధ్యక్షుడు బుజంగ్ రావు, సదాశివనగర్ మండల ఉప అధ్యక్షుడు రాజు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు