స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

24-09-2026 | 06:09pm

మున్సిపల్ కౌన్సిలర్స్  సిద్ధి శ్రీధర్ గుప్తా, గాదె తిరుపతి 

ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 24(విజయ క్రాంతి): మున్సిపల్ కేంద్రం లో(Municipal Headquarters)  మున్సిపల్ 8,9,వ వార్డ్ కౌన్సిలర్స్ సిద్ధి శ్రీధర్ గుప్తా. గాదె తిరుపతి  గ్రామ పరిపాలన అధికారుల తో  కలిసి పెద్ద మజీద్ వద్ద స్మార్ట్ రేషన్ కార్డులు(Smart Ration Cards) పంపిణీ చేశారు ఈ సందర్భంగా మున్సిపల్ కౌన్సిలర్ సిద్ధి శ్రీధర్ గుప్తా మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సులభంగా, పారదర్శకంగా అందించేందుకు రేషన్ కార్డు ఎంతో ముఖ్యమైనది ముఖ్యంగా పేద,

మధ్యతరగతి కుటుంబాలకు రేషన్ కార్డు ద్వారా తక్కువ ధరలకు నిత్యావసర సరుకులు అందడంతో పాటు, ప్రభుత్వం అమలు చేసే అనేక సంక్షేమ పథకాలకు అర్హత నిర్ధారణలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.అని అన్నారు అనంతరం 9వ వార్డ్ కౌన్సిలర్  గాదె తిరుపతి మాట్లాడుతూ  నూతన స్మార్ట్ రేషన్ కార్డుల విధానం ప్రజలకు మరింత సౌకర్యవంతమైన, ఆధునిక సేవలను అందించే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా చెప్పవచ్చు.అని అన్నారు 

స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా కుటుంబ వివరాలను డిజిటల్ విధానంలో నమోదు చేయడం, అర్హులైన కుటుంబాలను గుర్తించడం, రేషన్ పంపిణీ ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించడం సాధ్యమవుతుంది. కుటుంబ సభ్యుల వివరాలు, చిరునామా, కార్డు సంబంధిత సమాచారాన్ని ఒకే వ్యవస్థలో అనుసంధానం చేయడం వల్ల రికార్డుల నిర్వహణ సులభతరం అవుతుంది.

ప్రస్తుతం డిజిటల్ సాంకేతికత విస్తరిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్  ప్రభుత్వం ఈ సేవలను కూడా సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది అని గ్రహించి స్మార్ట్ రేషన్ కార్డులు ఈ మార్పుకు అనుగుణంగా రూపొందించబడింది. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ ప్రయోజనాలు చేరేలా చేయడంలో సహాయపడతాయి. అలాగే నకిలీ లేదా అనర్హమైన కార్డులను గుర్తించడం, రేషన్ పంపిణీలో అవకతవకలను తగ్గించడం వంటి అంశాల్లో కూడా డిజిటల్ వ్యవస్థ ఉపయోగపడుతుంది. అని చైర్మెన్ అన్నారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ గ్రామ పరిపాలన అధికారులు రాజు, హనుమాన్లు, తో పాటు మున్సిపల్ సిబ్బంది  ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు