విద్యార్థులకు చికెన్ తో భోజనం
నాగిరెడ్డిపేట,అక్టోబర్ 01 (విజయ క్రాంతి):మండలంలోని మెల్లకుంట తండా గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో (Parishad Primary School)చిన్నారులకు గ్రామ సర్పంచ్ బాల్య నాయక్ గురువారం చికెన్ భోజనం ఏర్పాటు చేశారు.ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమం సందర్భంగా పాఠశాలను సందర్శించిన సర్పంచ్..విద్యార్థులకు నెలకు ఒకసారి చికెన్‌తో భోజనం అందిస్తానని హామీ ఇచ్చారు.ఇచ్చిన మాట ప్రకారం విద్యార్థులకు చికెన్ భోజనం ఏర్పాటు చేసి హామీని నిలబెట్టుకున్నారు.
నూతన గ్రామ సర్పంచ్ బాల్య నాయక్ పాలకవర్గ సభ్యులతో కలిసి పాఠశాలకు చేరుకుని విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.సర్పంచ్, పాలకవర్గ సభ్యులు తమతో కలిసి భోజనం చేయడంతో చిన్నారులు ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్‌కు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు కొర్ర వాసురం,ఉపసర్పంచ్ రామావత్ వాసురం,వార్డు సభ్యులు అంగోత్ రమేష్, రెడ్యా,సరిత పాల్గొన్నారు.