గొల్లపల్లిలో పశు వైద్య శిబిరం
రామారెడ్డి, అక్టోబర్ 3 (విజయక్రాంతి): రామారెడ్డి మండలం(Ramareddy Mandal) గొల్లపల్లి గ్రామంలో పశు వైద్య(Veterinary medicine), పశుసంవర్ధక శాఖ(Department of Animal Husbandry) ఆధ్వర్యంలో శనివారం పాడి పశువులకు(Dairy cattle) గర్భకోశ చికిత్స శిబిరం నిర్వహించారు.ఈ సందర్భంగా మండల పశు వైద్యాధికారి డాక్టర్ టి. రామ్‌చందర్ మాట్లాడుతూ.. పాడి పశువుల్లో వచ్చే గర్భకోశ వ్యాధులు(Uterine diseases), వాటి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించారు.
ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున పశువులకు గడ్డి కొరత తలెత్తకుండా పాడి రైతులు ముందస్తుగా పచ్చగడ్డి సాగు చేసుకోవాలని సూచించారు. శిబిరంలో 28 పశువులకు గర్భ పరీక్షలు, 8 పశువులకు సాధారణ చికిత్సలు, 10 దూడలకు నట్టల నివారణ మందులు అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కిషన్ యాదవ్, వార్డు సభ్యులు, వీఎల్‌ఓ శ్రీనివాస్, జేవీఓ రాజ్ వీరయ్య, పశు వైద్య శాఖ సిబ్బంది, పాడి రైతులు పాల్గొన్నారు.