గణేష్ ఉత్సవాల నిర్వహణకు పోలీస్ శాఖ నుంచి ప్రథమ బహుమతి
శ్రీ రాఘవేంద్ర నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్‌కు అరుదైన గౌరవం
ఉప్పల్ సెప్టెంబర్ 29 విజయక్రాంతి : శ్రీ రాఘవేంద్ర నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ ఉత్సవాలకు తెలంగాణ పోలీస్ శాఖ తరఫున ప్రథమ నగదు బహుమతి లభించింది. ఉత్సవాల సందర్భంగా వారం రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అన్నదానం, ప్రసాద పంపిణీ, ఉచిత వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలను సమర్థవంతంగా నిర్వహించినందుకు ఈ అవార్డును అందజేశారు.
భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కన్వీనర్ బాలకృష్ణ, ఉప్పల్ డివిజన్ ఏసీపీ వెంకటరెడ్డి, నాచారం పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కె. ధనుంజయ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పోలీస్ శాఖ తరఫున శ్రీ రాఘవేంద్ర నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్‌కు ప్రథమ బహుమతిని అందజేశారు.
గణేష్ ఉత్సవాల సందర్భంగా మండపాల నిర్వహణ, భక్తులకు సేవలు, సామాజిక కార్యక్రమాలను పరిగణనలోకి తీసుకుని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బహుమతులను అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ద్వితీయ బహుమతిని కేఎల్ రెడ్డి నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్‌కు, తృతీయ బహుమతిని భవానీనగర్ శ్రీ విఘ్నేశ్వర వెల్ఫేర్ అసోసియేషన్‌కు అందజేశారు.
ఈ గౌరవం దక్కడానికి సహకరించిన పోలీస్ శాఖ అధికారులు, భక్తులు, సమితి సభ్యులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ సామాజిక, ధార్మిక సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.