సింగరేణి పెన్షనర్ల కోసం డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ క్యాంపులు
ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యామ్ సుందర్
నవంబర్ 11, 12 తేదీల్లో నిర్వహణ
సద్వినియోగం చేసుకోవాలని పిలుపు
భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): సింగరేణి సంస్థ(Singareni Company)లో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన పెన్షనర్ల సౌకర్యార్థం డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్(Digital Life Certificate) సమర్పణ కోసం ప్రత్యేక క్యాంపులను నిర్వహించనున్నట్లు ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యామ్ సుందర్ బుధవారం ఒక్క ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెన్షనర్లు తమ పెన్షన్ను నిరంతరాయంగా పొందేందుకు అవసరమైన లైఫ్ సర్టిఫికెట్ ప్రక్రియను సులభతరం చేయాలనే ఉద్దేశంతో ఈ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్యాంపులు నవంబర్ 11, 12 తేదీలలో స్థానిక క్రిష్ణకాలని మినీ ఫంక్షన్ హాలులో నిర్వహించనున్నట్లు తెలిపారు. పెన్షనర్లు క్యాంపులకు హాజరై తమ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పణ ప్రక్రియను పూర్తి చేసుకొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.