జిల్లా స్థాయి ఎస్జీఎఫ్ పోటీలకు సింగరేణి పాఠశాల విద్యార్థులు ఎంపిక
22-09-2026 | 08:46pm
భూపాలపల్లి టౌన్, సెప్టెంబర్ 22 ( విజయ క్రాంతి ) : భూపాలపల్లి అంబేద్కర్ స్టేడియంలో జరిగిన ఎస్జీఎఫ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF School Games Federation)మండల స్థాయి ఎంపికలలో సింగరేణి పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి నాంచారయ్య మాట్లాడుతూ ఈ సంధ్య, ఎన్ కీర్తన, సీహెచ్ రిష్వంత్ ఖో ఖో, బి హరిణి, సీహెచ్ ధనుష్ కుమార్ కబడ్డీలో ఎంపికైనట్లు తెలిపారు. జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను ఏరియా జనరల్ మేనేజర్ ఏ రాజేశ్వర్ రెడ్డి, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, పీఈటి ఎం శైలజ, ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు.