ప్రభుత్వ చేయూతను సద్వినియోగం చేసుకోవాలి
సర్పంచ్ భవానీ నవీన్ కుమార్
చిన్నకోడూర్, సెప్టెంబర్ 22: ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న చేయూతను సద్వినియం చేసుకోవాలని సర్పంచ్ భవాని నవీన్ కుమార్(Sarpanch Bhavani Naveen Kumar) అన్నారు. మంగళవారం రామంచ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం సమకూర్చిన స్కూల్ డ్రెస్ లను ఎఎపిసి ఛైర్పర్సన్ ప్రేమలత, ప్రధానోపాధ్యాయులు సురేష్ కుమార్, కార్యదర్శి శేఖర్ ఆనంద చారిలతో కలసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఉచితంగా యూనిఫాంలు, నోట్ బుక్స్, మధ్యాహ్నం భోజనంలను అందిస్తూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టేందుకు నిధులు మంజూరు చేస్తుందన్నారు. ప్రతిరోజు విద్యార్థులు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయులు చెప్పే విషయాలను శ్రద్ధగా వినాలన్నారు. విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను అలవర్చు కోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సునీత, ఆబెద బేగం, నాగమణి , యాదయ్య, స్వరూప తదితరులు పాల్గొన్నారు.