ముంపు బాదితులందరికీ ఇందిరమ్మ ఇండ్లు
కుభీర్, సెప్టెంబర్ (విజయక్రాంతి )22: సుద్ద వాగు బ్యాక్ వాటర్ తో (Chalky stream backwater)ముంపునకు గురైన నిగ్వా గ్రామస్తులకు పునరావాసం కింద కేటాయించిన స్థలంలో బాధితులందరికీ ఇళ్ల స్థలాలను కేటాయించి, ఇంటి పట్టాలు, అందజేసేందుకు చర్యలు చేపడతామని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా(District Collector Bhavish Mishra) పేర్కొన్నారు. మంగళవారం ఆయన నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని నిగ్వా గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులతో పెండింగ్ లో ఉన్న ఇంటి స్థలాల కేటాయింపు పై చర్చించారు.
గత ఇరవై ఏళ్ల క్రితం ప్రభుత్వం కేటాయించిన 26 ఎకరాల భూమిలో 195 ఇంటి స్థలాలను ఎంపిక చేసి అందులో సిసి రోడ్లు వేయడం కూడా జరిగిందని ఎందుకు ఇంతవరకు ఇంటి స్థలాలు కేటాయించలేదని అధికారులపై మండిపడ్డారు. వెంటనే గ్రామ సభ ఏర్పాటు చేసి గ్రామస్తులందరూ ఐక్యతతో తీర్మానం చేసి డ్రా ద్వారా లేదా ఇష్టపూర్వకంగా ఇంటి స్థలాలు తీసుకుంటామని తీర్మానం చేసుకుని పంపించినట్లయితే ఇంటి పట్టాలు అందజేసి ఇంటి స్థలాలు కేటాయించడం జరుగుతుందన్నారు.
దీంతోపాటు ముంపు బాధితులు అందరికీ ఇందిరమ్మ పథకం ద్వారా ఇండ్లను నిర్మించుకునేందుకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. ఈ ప్రక్రియ నెల రోజుల్లోపు పూర్తిచేయాలని తహసిల్దార్ శ్రీదేవి స్థానిక సర్పంచ్ మెంచు రమేష్ లకు సూచించారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఇంటి స్థలాల కేటాయింపు కలెక్టర్ తమ గ్రామానికి వచ్చి పరిష్కార దిశగా కృషి చేశారని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. స్థానిక సర్పంచ్ మంచు రమేష్ కృషివల్లే పునరావాస గ్రామ ప్రక్రియ మళ్లీ ప్రారంభం అవుతోందని గ్రామస్తులు పేర్కొన్నారు. స్థానిక ఎల్లమ్మ ఆలయంలో కలెక్టర్ ను సర్పంచ్ రమేష్ శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈయన వెంట స్థానిక సర్పంచ్ మెంచు రమేష్, తహసిల్దార్ శ్రీదేవి, ఎంపీడీవో ఓలెం భూమారావు, ఎంపీఓ భీమేష్, ఏపీవో రాథోడ్ హరిలాల్, సరికొండ ఆనంద్, గ్రామస్తులు ఉన్నారు.