గణపురం టీయూడబ్ల్యూజే పగ్గాలు కిషోర్‌కు
గణపురం, అక్టోబర్ 12 (విజయ క్రాంతి): తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ H-143) గణపురం మండల అధ్యక్షుడిగా రౌతు కిషోర్ సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీఆర్ లెనిన్, రాష్ట్ర కార్యదర్శి తడక రాజ్ నారాయణ గౌడ్, కక్కెర్ల జగన్ గౌడ్, మంతెన సమ్మయ్యల ఆదేశాల మేరకు నూతన మండల కమిటీని ప్రకటించారు.
మండల సంఘం గౌరవ అధ్యక్షుడిగా తాళ్లపల్లి యాదగిరి గౌడ్, ప్రధాన కార్యదర్శిగా గొర్రె ఎల్లయ్య యాదవ్, కోశాధికారిగా పెద్ది పోషయ్య ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా పైడిమల్ల నరేష్ గౌడ్, లావుడియా వినోద్ కుమార్, పుప్పాల దీపక్ పటేల్ బాధ్యతలు చేపట్టనున్నారు. సంయుక్త కార్యదర్శిగా కుక్కముడి బాబు, కార్యవర్గ సభ్యుడిగా తాళ్లపల్లి యుగంధర్ గౌడ్ ఎన్నికయ్యారు (New Committee).
గణపురం మండల కమిటీలో తమకు స్థానం కల్పించిన రాష్ట్ర నాయకులకు నూతన కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల సంఘం బలోపేతానికి, పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి సమన్వయంతో కృషి చేస్తామని నూతన కమిటీ తెలిపింది (Journalists' Union).