మనూరు మాజీ ఎంపీపీ కన్నుమూత!

12-10-2026 | 03:35pm

నారాయణఖేడ్, అక్టోబర్ 12 (విజయక్రాంతి): మనూరు మండల మాజీ ఎంపీపీ కొంగరి వీరమణి రెడ్డి అనారోగ్యంతో సోమవారం ఉదయం మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా మనూరు మండలంలోని బోరంచ గ్రామానికి చెందిన వీరమణి రెడ్డి 2006లో బోరంచ ఎంపీటీసీగా ఎన్నికయ్యారు. అనంతరం 2006 నుంచి 2012 వరకు మనూరు మండల పరిషత్ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించి మండల ప్రజలకు సేవలందించారు.

మాజీ ఎంపీపీ కొంగరి వీరమణి రెడ్డి మృతి పట్ల ఎమ్మెల్యే డాక్టర్ పట్లోల సంజీవరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు పట్లోల చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ, కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

మరిన్ని వార్తలు