విధుల్లో ఉన్నట్టా.. లేనట్టా?
బోథ్, అక్టోబర్ 12 (విజయక్రాంతి): సోనాల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో గతంలో డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వహించిన జి. ప్రేమ్ నివాస్ ప్రస్తుతం విధుల్లో ఉన్నారా? లేదా? అనే అంశంపై గ్రామానికి చెందిన గడప రాజన్న స్థానిక తహసీల్దార్ మల్లేశానికి ఫిర్యాదు చేశారు.
డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వహించిన ప్రేమ్ నివాస్ సుమారు 15 రోజుల క్రితం డిప్యూటేషన్‌పై (Deputation) మరోచోటికి వెళ్లినట్లు సమాచారం ఉందని రాజన్న పేర్కొన్నారు. అయినప్పటికీ గత 15 రోజులుగా సోనాల తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ కుర్చీ అలాగే ఉందని తెలిపారు.
అసలు డిప్యూటీ తహసీల్దార్ విధుల్లో ఉన్నారా? లేక డిప్యూటేషన్‌పై వెళ్లారా? అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ తహసీల్దార్‌కు వినతిపత్రం (Representation) అందజేశారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు.