కేతు భాచావో అభియాన్ కార్యక్రమం

05-11-2026 | 07:13pm

జగిత్యాల, నవంబర్ 05 ( విజయ క్రాంతి ): వ్యవసాయ శాఖ(Department of Agriculture) ఆధ్వర్యంలో  కేతు భాచావో అభియాన్ కార్యక్రమం('Ketu Bachao Abhiyan' Program) మోతె గ్రామపంచాయతీ లో నిర్వహించడం జరిగింది. మండల వ్యవసాయ ఆధికారి బి. వినీల మాట్లాడుతూ వరి కోతల అనంతరం పంట అవశేషాలు కాల్చడం వల్ల భూమి ఆరోగ్యమే కాకుండా వాతావరణ కాలుష్యo ఏర్పడుతుందన్నారు. 

పంట అవశేషాలు కాల్చకుండా ఉంటే భూమి లోని సూక్ష్మ పోషకాలు, సూక్ష్మ జీవులు నశించకుండా, పశుగ్రాసo కు కూడా ఉపయోగ పడుతుందని, కలియదున్నడం వల్ల భూమి సారం కాపాడగలం అని అవగాహనా కల్పించారు. ఎల్నినో ప్రభావంతో రాబోయే యాసంగి సీజన్ గాను వరికి బదులుగా అరుతడి పంటలు పెసర, కొయ్యమక్క, నువ్వులు, కూరగాయలతో ఉన్న నీటి వనరులతోటి పంటలు పందించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ ఎస్. మహేష్, ఉపసర్పంచ్ పిట్ట పద్మ, వార్డు సభ్యులు, రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు