గౌడ సంఘం నూతన అధ్యక్షుడికి బీజేపీ నేతల సన్మానం

27-10-2026 | 05:14pm

గణపురం, అక్టోబర్ 27 (విజయక్రాంతి): గణపురం గౌడ సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మండ రవి గౌడ్, ఉపాధ్యక్షుడు మచ్చిక శంకర్ గౌడ్లను గణపురం బీజేపీ నాయకులు(BJP Leaders) శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బీజేపీ గణపురం మండల కన్వీనర్ మంద మహేష్ మాట్లాడుతూ గౌడ సంఘం అభ్యున్నతికి బీజేపీ, కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దుప్పటి భద్రయ్య, ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి మాదాసు మొగిలి గౌడ్, బీజేపీ సీనియర్ నాయకుడు సోమ దామోదర్, గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు