జాతీయ స్థాయి పోటీలకు లింగమల్ల కౌశిక్ రామ్ ఎంపిక

21-09-2026 | 04:58pm

మహా ముత్తారం,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally Districtమహా ముత్తారం ఘట్‌కేసర్‌లో 16-09-2026న నిర్వహించిన అండర్-12 రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్‌(Fencing Championship)లో ప్రతిభ కనబరిచిన టి జి ఎస్ ఎస్ క్రీడాకారుడు లింగమల్ల కౌశిక్ రామ్ సాబ్రే విభాగంలో కాంస్య పతకం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. చిన్న వయసులోనే ఫెన్సింగ్ క్రీడలో తన ప్రతిభను చాటుకున్న లింగమల్ల కౌశిక్ రామ్, రాష్ట్రస్థాయి పోటీల్లో అద్భుత ప్రదర్శన చేసి జమ్మూ కాశ్మీర్‌లో జరిగే జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కించుకున్నాడు. 

ఈ సందర్భంగా లింగమల్ల కౌశిక్ రామ్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో సాధించిన విజయం తనకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందని, జాతీయ స్థాయిలో కూడా మంచి ప్రదర్శన చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. కౌశిక్ రామ్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల తల్లిదండ్రులు, కోచ్‌లు, టి జి ఎస్ ఎస్ నిర్వాహకులు మరియు క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు, తెలంగాణ రాష్ట్రానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు