గుంతలమయంగా జనగామ-హుస్నాబాద్ ప్రధాన రహదారి

04-11-2026 | 11:42am

- వాహనదారుల ఇబ్బందులు

నర్మెట,(విజయక్రాంతి): జనగామ జిల్లా(Jangaon district) నర్మెట మండల ప్రధాన రహదారి అయిన జనగామ-హుస్నాబాద్(Jangaon-Huznabad) మరియాపురం గ్రామం దగ్గరలో రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారిందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై ఏర్పడిన పెద్ద పెద్ద గుంతల కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, నిత్యం ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతులు(Road Repairs) చేపట్టి గుంతలను పూడ్చి ప్రయాణానికి అనుకూలంగా మార్చాలని వాహనదారులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు