ఆదర్శ పాఠశాల ఇంటర్ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్
రఘునాథపల్లి, అక్టోబర్ 23 (విజయక్రాంతి): రఘునాథపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల, కళాశాల ఇంటర్ విద్యార్థులకు 10 రోజుల దసరా ఇంటర్న్‌షిప్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ పాలకుర్తి శ్రీధర్(Principal Palakurthi Sridhar) తెలిపారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ విభాగం విద్యార్థులు జనగామలోని స్వామి ఫిట్‌నెస్ సెంటర్‌ను సందర్శించారు. బాడీ బిల్డింగ్, డైట్ ప్లాన్, ఫిట్‌నెస్ నిర్వహణ, స్వయం ఉపాధి అవకాశాలపై ప్రత్యక్ష అనుభవం పొందారు.
మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ విభాగం విద్యార్థులు ప్రదీప్ ఫోటో స్టూడియోను సందర్శించి ఫోటోగ్రఫీ, కెమెరా వినియోగం, ఫోటో ఎడిటింగ్, డిజిటల్ మీడియా టెక్నిక్స్, స్టూడియో నిర్వహణపై అవగాహన పొందారు. ఈ కార్యక్రమంలో వృత్తి విద్య ఉపాధ్యాయుడు వెనిల్ కుమార్, మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉపాధ్యాయురాలు రేణుక, విద్యార్థులు పాల్గొన్నారు.