వినాయకుడి నిమజ్జనంలో విషాదం..

24-09-2026 | 03:06pm

విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

ధర్మపురి,సెప్టెంబర్24 (విజయక్రాంతి):జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేటలో(Kothapeta) బుధవారం రాత్రి గణేష్ నిమజ్జన వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొప్పుల రాజశేఖర్ (23) విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో సౌండ్ బాక్సులకు విద్యుత్ సరఫరా చేసే మెయిన్ వైర్లను కర్రతో సరిచేస్తుండగా ప్రమాదం జరిగినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.

మరిన్ని వార్తలు