ఉపాధ్యాయుల సమస్యలపై పి ఆర్ టి యు టి ఎస్ పోరాటం

03-11-2026 | 05:02pm

జగిత్యాల, నవంబర్ 03 ( విజయ క్రాంతి ): ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం పి ఆర్ టి యు టి ఎస్(PRTUTS) కృషి చేస్తుందని పి ఆర్ టి యు టి ఎస్ జగిత్యాల జిల్లా శాఖ(PRTUTS Jagtial District Branch) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యాళ్ల అమర్నాథ్ రెడ్డి, బోయిని పెల్లి ఆనందరావు అన్నారు.

ఈరోజు ప్రాథమిక పాఠశాల టి ఆర్ నగర్ ప్రధానోపాధ్యాయులు అడ్లగట్ట గంగాధర్ ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా పాల్గొని 2003 డిఎస్సి సంబంధించిన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు అయ్యే విధంగా కృషి చేస్తామని పిఆర్సి వచ్చేవరకు పోరాటం చేస్తామని వారన్నారు. ఈ సందర్భంగా అడ్లగడ్డ గంగాధర్ ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీలత, గంగయ్య, ప్రభాకర్, ప్రవీణ్, అనూజ, మాధవి, షబానా, విమల, షకీల్, మనోహర్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు