రాజకీయ రంగంలో వాటా ఎక్కడ?
- 56% ఉన్న బీసీలకు రాజకీయ రంగంలో తగిన ప్రాతినిధ్యం కల్పించాలి
- బీసీ నాయకుల డిమాండ్
- సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): జనాభాలో మెజారిటీగా ఉన్న బీసీలకు రాజకీయ(Political) రంగంలో తగిన ప్రాతినిధ్యం కల్పి ంచాలనే డిమాండ్‌తో 56% బీసీలు.. రాజకీయ రంగంలో వాటా ఎక్కడ? అనే అంశం పై శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్(Somajiguda Press Club)లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, బీసీ ఇంటెలెక్టువల్స్ ఫోరం చైర్మన్ టి. చిరంజీవులు(T Chiranjeevulu) అధ్యక్షతన రౌం డ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎన్జీవోలు, సామాజిక ఉద్యమకారులు, మేధావు లు, వివిధ బీసీ సంఘాల ప్రతినిధులు పా ల్గొన్నారు. సమావేశంలో బీసీల రాజకీయ ప్రాతినిధ్యంపై టి. చిరంజీవులు గణాంకాలతో కూడిన ప్రజెంటేషన్ ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్రం(Telangana State) ఏర్పడకముందు 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐదుగురు బీసీలు మంత్రులుగా ఉండగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో ఆ సంఖ్య నలుగురికి, 2018లో ముగ్గురికి, ప్రస్తుతం 2026లో ఇ ద్దరికి తగ్గిందని ఆయన పేర్కొన్నారు. ఖమ్మ ం, నల్గొండ, నిజామాబాద్ తదితర జిల్లాల్లో బీసీల రాజకీయ ప్రాతినిధ్యం తగ్గుతున్న తీరును కూడా గణాంకాలతో వివరించారు. శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ.. జనాభాలో మెజారిటీగా ఉన్న బీసీలు రాజకీయ అధికారంలో మాత్రం మైనారిటీ స్థా యిలో ఉండటం బాధాకరమన్నారు.
బీసీలకు న్యాయమైన వాటా లభించాల్సిన అవ సరం ఉందన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీలు ఐక్యంగా ఉంటే నే రాజకీయాధికారాన్ని సాధించగలరని అన్నారు. బీసీలంతా ఐక్యంగా తమ హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. బాలగోని బాలరాజుగౌడ్ మాట్లాడుతూ.. బీసీల హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం కో సం జరుగుతున్న ఉద్యమానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ, శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు సామాజిక న్యాయం గురి ంచి మాట్లాడుతూనే, మరోవైపు దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో అగ్రకులాలకు చెందిన వ్యక్తులను ముఖ్యమంత్రులుగా నియమించడం ద్వారా సామాజిక న్యాయం విషయం లో ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. బీజేపీ నాయకుడు తాడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ.. బీసీ కు లాలను విభజించి, వారి ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కటకం నరసింహారావు, గుజ్జ సత్యం మాట్లాడుతూ రాబోయే కాలం బీసీలదేనని, బీసీ రాజ్యాధికారం సాధ్యమేనని అన్నారు.
వట్టే జనార్దన్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో యాదవుల పై వేధింపులు పెరుగుతున్నాయని ఆరోపించారు. తెలంగాణ విట్టల్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీసీలకు రాజకీయంగా తీవ్రమైన అన్యాయం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో రాజు అడ్వొకే ట్, పొన్నం దేవరాజు, ఎర్ర సత్యనారాయణ, సూర్యనారాయణ, ఇలి వెంకన్న, దుర్గయ్య గౌడ్, మెట్టు సూర్యప్రకాశ్, బైరి శేఖర్ .కర్ణాటి మనోహర్, చిన్నారాములు, ముదిరాజ్. చెన్న శ్రీకాంత్, బొంగు ప్రసాద్, నీరజ గౌడ్, లింగేశ్ చోళ రాజేశ్వర్, యాదవ్ పాల్గొన్నారు.
ప్రధాన నిర్ణయాలు
రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ క్రింది ప్రధాన నిర్ణయాలు తీసుకున్నా రు. . ప్రస్తుతం ఖాళీగా ఉన్న మూడు మంత్రి పదవులను తక్షణమే బీసీలకు కేటాయించాలి. గవర్నర్ కోటాలో ఖాళీ కానున్న మూడు ఎమ్మెల్సీ స్థా నాల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలి. వడ్డెర, కుమ్మరి, నాయీబ్రాహ్మణ తదితర ఇప్పటివరకు తగిన ప్రాతినిధ్యం పొందని బీసీ కులాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. జనగణనలో ప్రతి కులానికి ప్రత్యేకమైన యూనిక్ కోడ్ కేటాయించాలి.
బీసీల రాజకీయ ప్రాతినిధ్యంపై రాష్ట్రవ్యాప్తంగా విస్తృతమైన చర్చ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. బీసీలకు జరుగుతున్న రాజకీయ అన్యా యంపై గణాంకాలతో కూడిన ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలి. బీసీ సమాజంలోని అన్ని కులాలు, సంఘాలు, మేధావులు ఐక్యంగా ముందుకు రావాలి.