బీఆర్ఎస్ హయాంలోనే.. లక్షలాది ఎకరాల చెర
- 22 ఏలో ఆనాడే 1,02,52, 690 ఎకరాలు
- మేం అధికారంలోకి వచ్చాక.. 47,440 ఎకరాలు తొలగింపు
- ప్రస్తుతం 1,02,05,250 ఎకరాల భూమి నిషేధిత జాబితాలో..
- రెవెన్యూ శాఖలో బీఆర్ఎస్ చేసిన విధ్వంసం చిన్నది కాదు
- మాట వినలేదని వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేశారు
- ధరణిని అడ్డుపెట్టుకుని అర్ధరాత్రి రిజిస్ట్రేషస్లు చేసుకున్నారు
- బీఆర్ఎస్పై మంత్రి పొంగులేటి ధ్వజం
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): ధరణి పోర్టల్(Dharani Portal) అడ్డుపెట్టుకుని గత పాలకులు లక్షలాది ఎకరాల భూముల(Lands)ను చెరబట్టారని.. ఇప్పుడు అసెంబ్లీ(Assembly) సాక్షిగా వాళ్ల బండారం బయటపడుతుందని తప్పించుకు తిరుగుతున్నారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Ponguleti Srinivasa Reddy) ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ(Congress Party) అధికారంలోకి వచ్చేనాటికి (2023 డిసెంబర్, 7) బీఆర్ఎస్ హయాంలోనే 22 ఏలో 1,02,52, 690 ఎకరాలు నిషేధిత జాబి తాలో ఉన్నాయని మంత్రి పొంగులేటి తెలిపారు.
ఈ ఏడా ది ఆగస్టు 31 నాటికి 1,02,05,250 ఎకరాలు నిషేధిత జాబితా(Prohibited list)లో ఉన్నాయన్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 47,440 ఎకరాలు నిషేధిత జాబి తా నుంచి తగ్గాయని, వాస్తవం ఇలా ఉంటే 22 ఏలో లక్ష కోట్ల ఎకరాలు చేర్చారంటూ బీఆర్ఎస్ విషప్రచారం చేస్తోందని మంత్రి పొంగులేటి మండిపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri District)లో సుమారు 40 వేల ఎకరాలు నిషేధిత జాబితాలో చేర్చామన్నది వాస్తవం కాదని, 40 వేల ఇంటి స్థలాలు మాత్రమేనని మంత్రి స్పష్టం చేశారు.
2025 డిసెంబర్లో జరిగిన డేటా ఆప్డేషన్ సమయంలో ఇంటి నంబర్‌తో పాటు లబ్ధిదారుడి పేరును చేర్చడం వల్ల సాంకేతిక సమస్య తలెత్తిందని , ఈ విషయం తమ దృష్టికి రాగానే తక్షణమే సమస్యను పరిష్కరించినట్లు మంత్రి తెలిపారు. ఇవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచే నిషేధిత జాబి తాలో ఉన్నాయని, కొత్తగా చేర్చిన భూములు కావన్నారు. 22- ఏ నిషేధిత భూముల అంశంపై శనివారం అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరిగింది.
ఈసందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. పోరాడి సాధించుకున్న తెలంగాణను కేసీఆ ర్ స్వప్రయోజనాల కోసం వాడుకున్నారని, పదేళ్లలో కేసీఆర్ కుటుంబం వాళ్ల బంధువులు మాత్రమే బాగుపడ్డారని విమర్శించా రు. కేసీఆర్ రెండోసారి ప్రభుత్వంలో రె వెన్యూ శాఖను పూర్తిగా తనవద్దే ఉంచుకుని, భూముల అక్రమాలకు పాల్పడ్డారని మంత్రి దుయ్యబట్టారు. భూములు కొల్లగొట్టేందుకే ధరణిని వాడుకున్నారని రాష్ట్రంలోని 2.49 కోట్ల ఎకరాలను తమ సొంత ఆస్తిలా గత పాలకులు భావించారని ఆరోపించారు.
ధరణి పోర్టల్ నిర్వహణను దివాళా తీసిన విదేశీ సంస్థ టెర్రాసిస్‌కు కు అప్పగించారని తెలిపారు. తాము అధికారంలోకి వ చ్చాక, టెరాసిస్ సంస్థను తొలగించి కేంద్ర సంస్థ అయిన ఎన్ఐసీకి అప్పగించామన్నారు. ధరణి పోర్టర్‌ను గుప్పిట్లో పెట్టుకుని అ ర్థరాత్రి వేళ రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని.. ధర ణి కారణంగా అనేక మంది రైతులు, భూయజమానులు అనేక ఇబ్బందులు పడ్డారని, పరిష్కారం దొరకక రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని మంత్రి అన్నారు.
మేం అధికాకరంలోకి వచ్చేనాటికి..
రాష్ట్రంలో నిషేధిత జాబితాలో ఉన్న భూ ములపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వివరించారు. 2023 నాటికి నిషేధిత జాబితాలో ఉన్న వివాదంలో ఉన్న భూముల్లో అటవీ భూములు 42, 61, 532 ఎకరాలు, అసైన్డ్ భూ ములు 24, 63, 940 ఎకరాలు, ఇతర ప్రభుత్వ భూము లు 29, 35, 554 ఎకరాలు, ప్రైవేట్ వ్యవసాయ భూము లు 3, 95, 852 ఎకరాలు ప్రైవేట్ వ్యవసాయేతర భూమి 1, 95, 812 ఎకరాలు, ఎండో మెంట్ భూములు 5,12,792 ఎకరాలు కలి పి మొత్తం 1,02,52,690 ఎకరాలు నిషేదిత జాబితాలో ఉన్నాయి.
25 వేల ఇండ్లు నిషేధిత జాబితాలో ఉన్న మాట వాస్తవమని, కొన్ని దశాబ్దాల క్రితం వారు అసైన్డ్ భూము ల్లో ఇల్లు కట్టుకున్నది వా స్తవం అన్నారు. పేదల సొంతింటి కల నెరవేర్చుకునేందు కు ప్రభుత్వం అసైన్డ్ భూములు ఇచ్చిందని అసై న్డ్ భూముల విషయంలో ఏం చేయాలో సలహాలు ఇవ్వమనండి అన్నారు. అసైన్డ్ భూములు ఉమ్మడి రాష్ట్రం నుంచే నిషేధిత జాబితాలో ఉన్నాయని పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ మరి ఈ సమస్యను ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు. ఇప్పుడు గతం కంటే 47,440 ఎకరాలు నిషేధితా జాబితా నుంచి తగ్గాయన్నారు.
బీఆర్ఎస్ విధ్వంసం చిన్నది కాదు..
రెవెన్యూ శాఖలో బీఆర్ఎస్ చేసిన విధ్వం సం చిన్నది కాదని 80 మాడ్యూల్స్‌తో ధరణిని తీసుకువచ్చి పేదలకు ఇబ్బంది పెట్టార ని తమ ప్రభుత్వం 5 మాడ్యుల్స్కు కుదిం చి భూ సమస్యలను పరిష్కరిస్తున్నామని మం త్రి తెలిపారు. భూములు ఆన్లైన్ చేసే సమయంలో అనేక త ప్పిదాలు జరిగాయన్నారు. ధరణి పోర్టల్‌లో తప్పుల నమోదు వల్ల వం దల సంఖ్యలో రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ధరణి పోర్టల్ కు లాక్ అనే సిస్టమ్ పెట్టి.. అందరి భూములపై నిఘా పెట్టారని ఒకరిద్దరు వీఆర్వోలు వాళ్ల మాట వినలేదని రాత్రికి రాత్రే వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థలను రద్దు చేశారన్నారు.
ప్రత్యామ్నాయం చూపకుండా వీఆర్వో, వీఆర్ఏలను రద్ధు చేసి గ్రా మ స్థాయిలో రెవెన్యూ పర్యవేక్షణ లేకుండా చేశారన్నారు. గతంలో కొత్త రెవెన్యూ చట్టం తెచ్చాక రెండున్నరేళ్లకు విధివిధానాలు తీసుకువచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో అక్కడక్కడ రిజిస్ట్రేషన్ల సమస్య ఉన్న మాట వస్తావమేనని.. కానీ ధరణి చట్టాన్ని తెచ్చినప్పుడు 3 నెలల రిజిస్ట్రేషన్లు నిలిపివేశారని మంత్రి పొంగులేటి తెలిపారు. గత ప్రభుత్వంలో లక్షలాది అప్లికేషన్లు వస్తే సింపుల్‌గా రిజెక్ట్ చేశా రు. కేసీఆర్ సొంత నియోజకవర్గంలోనూ ధరణితో ఇబ్బందులొచ్చాయన్నారు. భూ భారతిలో బీఆర్ఎస్ నేత లు ఇచ్చిన సూచనలు కూడా పొందుపరిచామన్నారు.
భూమి లేకున్నా రైతుబంధు
రెవెన్యూ రికార్డుల ప్రకారం 387 గ్రామాలకు నక్షలు లేవన్నారు. దాదాపు 125 ఏళ్ల త ర్వాత గ్రామాల్లో సమగ్ర భూసర్వే చేపట్టామని పొంగులేటి తెలిపారు. పైలెట్ ప్రాజెక్టు లో భాగంగా 70 రెవెన్యూ గ్రామాల్లో చేపట్టిన గ్రామాల్లో ఇప్పటికే భూమి మొత్తం సర్వే చేసి రైతులకు పాసుపుస్తకాలు ఇస్తున్నామని, వచ్చే ఏడాదిన్నరలోపు రాష్ట్రవ్యాప్తంగా భూసర్వే పూర్తి చేసి రైతులకు మేలు చేస్తామని స్పష్టం చేశారు. దొరల పాలనలో పా సుపుస్తకాలు ఉండేవి కానీ, భూములు మా త్రం ఉండేవి కాదు.
ధరణి చట్టం తెచ్చి తమ బంధువులు, రాజకీయ అనుచరులకు పాసుపుస్తకాలు ఇచ్చారు. భూమిలేకుండానే ఆ పాసుపుస్తకాలకు కోట్ల రూపాయల రైతుబం ధు ఇచ్చారు. భూమి లేని వారికీ రైతుబంధు ఇచ్చి వేలకోట్ల ప్రజాధనం కొల్లగొట్టారని తెలిపారు. ఒక్క నల్లగొండ జిల్లాలోనే 14 వేల ఎకరాల్లో సర్వే చేస్తే 4 వేల ఎకరాలకు దొంగ పట్టాలు ఉన్నాయన్నారు.
మాక్ అసెంబ్లీ ఎందుకు..?
అసలు అసెంబ్లీ ఇక్కడ నిర్వహిస్తుంటే మాక్ అసెంబ్లీ ఎందుకు..? అసెంబ్లీకి రాకుం డా మాక్ అసెంబ్లీ పెట్టుకుని అక్కడ డ్రామా లు ఆడుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. ధరణి ఉన్నప్పుడు 2.49 లక్షల దరఖాస్తులు ఉండేవని, భూభారతిగా మారిన తర్వాత మరో 3 లక్షల దరఖా స్తులు వచ్చాయని మంత్రి పొం గులేటి తెలిపారు. మొత్తం 5 లక్షల పైచిలుకు దరఖాస్తు లను పరిష్కరించామని తెలిపారు. పరిష్కరించలేని దరఖాస్తులకు ఏ కారణంతో పరిష్క రించలేదో చెప్పామన్నారు. ధరణి సమయంలో ఎలాంటి అప్పీలేట్అథారిటీ ఉండేది కాదన్నారు. ధరణి సమయంలో ఏ దరఖాస్తు అయినా కలెక్టర్ల దగ్గరకే వెళ్లేదని పొంగులేటి వివరించారు.
బీఆర్ఎస్, బీజేపీ డ్రామాలు..
22 -ఏపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని మంత్రి పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 ఏళ్లుగా సీఎస్--7, సీఎస్--13, సీఎ స్-14 నిషేధిత జాబితాలో ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరు నిషేధిత జాబితా నుంచి తీసేయాలంటారు.. హరీశ్‌రావు అక్రమాలు అంటున్నారు. ఇందులో ఏది నిజమని మంత్రి ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో కం టే ఇప్పుడే నిషేధిత జాబితాలో తక్కువ భూములు ఉన్నాయన్నారు. మేం వచ్చాక 22ఏ భూముల సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు.
ధరణి ముసుగులో వందల ఎకరాలు మాయం
బీఆర్ఎస్ హయాంలో ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకుని వందల ఎకరాల భూములు కొల్లగొట్టారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. ఈ అక్ర మాలకు కర్త, కర్మ, క్రియ కేసీఆర్, హరీష్‌రావేనని విమర్శించారు. హరీష్‌రావు మామ మాధవరం హన్మంతరావుకు లబ్ధి జరిగిందన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెలికట్ట గ్రామం సర్వే నెంబర్ 271లో 4.32 ఎకరాలు, సర్వే నెంబర్ 271 లోని మొత్తం ఏ11లో 327.09 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందని తెలిపారు. ఈ భూమి మొత్తం అసైన్మెంట్ పట్టాలు ఇ వ్వడం జరిగిందన్నారు.
6.18 ఎకరాల అసైన్డ్ భూమి, సర్వే నెంబర్ 271/98లో మాజీ సైనికుడు పాసి సత్యనారాయణ నుంచి 4.08 ఎకరాలు కొనుగోలు చేశారని మంత్రి తెలిపారు. అల్లుడు హరీష్రా వు పరపతి ఉపయోగించి 22 ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించి పట్టా భూమిగా మార్చుకున్నరాని తెలిపారు. మెదక్ జిల్లా శివంపేట మండలం సికింద్లాపూర్ గ్రామం సర్వే నెంబర్ 33 నుంచి 87569.05 ఎకరాల ఇనాం భూ కుంభకోణం జరిగిందని తెలిపారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిప్పల్‌తుర్తిలో సర్వే నెంబర్ 58, 59లలో 546.39 ఎకరాలు ఉండగా, 2020లో 112.21 ఎకరాలను 22ఏ నుంచి తొలగించారు.
రంగారెడ్డి జిల్లా గండిపేట మండటం వట్టినాగులపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 186 నుంచి 189లలో 29.27 ఎకరాల భుదాన్ భూమిని పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎం వాసు, వెంకటరాలు తదితరులు కొనుగోలు చేశా రు. 2022- 23 మధ్య కాలంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్‌తో పాటు మరి కొందరు బీఆర్ఎస్ నాయకులు 226.06 ఎకరాలు రాత్రిరాత్రి పీవోబీ నుంచి తొలగించి హస్తగతం చేసుకున్నారు.
తమ ప్ర భుత్వం వచ్చాక ఈ భూముల రిజిస్ట్రేషన్లు బ్లాక్ చేసినట్లు మంత్రి పొంగులేటి వివరించారు. ఒక గంగుల కమలాకరే రూ. 30 వేల కోట్ల విలువ చేసే భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. తూంకుం టలో రక్షణ శాఖకు చెందిన 66 ఎకరాలు కూడా అన్యాక్రాంతమయ్యాయన్నారు.