60 మంది ప్రముఖుల విజయగాథ
హైబిజ్ టీవీ ‘కాఫీ టేబుల్ బుక్’ ఆవిష్కరణ
హైదరాబాద్, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): వివిధ రంగాల్లో తమదైన ముద్ర వేసిన 60 మంది ప్రముఖుల ప్రస్థానాలు, విజయాలు, సేవలను పరిచయం చేసే ‘కాఫీ టేబుల్ బుక్’ను హైబిజ్ టీవీ ఆవిష్కరించింది. నానక్‌రామ్‌గూడలోని ప్రదాన్ కన్వెన్షన్ సెంటర్‌లో (Pradhan Convention Center)ఈ కార్యక్రమం జరిగింది. ఏపీ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టి.జి. భరత్ (Minister T.G. Bharat )ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు.
కేంద్ర కిషన్ రెడ్డి వర్చువల్ వీడియో కాల్ ద్వారా కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. హైబిజ్ టీవీ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ నిర్వాహకులకు, పుస్తకంలో చోటు పొందిన ప్రముఖులకు శుభాకాంక్షలు తెలిపారు. వ్యాపారం, వైద్యం, విద్య, మీడియా, మౌలిక వసతులు, పరిశ్రమలు, వినోదం, ఆతిథ్యం తదితర రంగాలకు చెందిన 60 మంది ప్రముఖుల వ్యక్తిగత, వృత్తిపరమైన ప్రస్థానాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు.
వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన పలువురు ప్రముఖులను సత్కరించారు. మంత్రి టి.జి. భరత్ మాట్లాడుతూ.. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న ప్రముఖుల ప్రస్థానాలను ఒకే వేదికపై పరిచయం చేయడం అభినందనీయమన్నారు. హైబిజ్ టీవీ ఫౌండర్ రాజ్ గోపాల్, మేనేజింగ్ డైరెక్టర్ సంధ్యా రాణి మాట్లాడుతూ.. విభిన్న రంగాలకు చెందిన 60 మంది ప్రముఖుల ప్రస్థానాలను ఒకే సంకలనంగా తీసుకురావడం ఆనందంగా ఉందన్నారు.
కాఫీ టేబుల్ బుక్‌లో చోటు పొందిన 60 మంది వీరే
డాక్టర్ కేఐ వరప్రసాద్‌రెడ్డి (శాంత బయోటిక్), డా. బీవీఆర్ మోహన్‌రెడ్డి (సైయెంట్), మురళీమోహన్ ఎం (జయభేరి గ్రూప్), జాహిద్ అలీ ఖాన్ (సియాసత్ డైలీ), డా. భాస్కర్‌రావు బొల్లినేని (కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్), శైలజా కిరణ్ (మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్), ఐ. వెంకట్ (ఈనాడు గ్రూప్), లేఖ్రాజ్ రమణి (కరాచీ బేకరీ), డా. మంజుల అనగాని (సుయోష ఏ పర్‌ఫెక్‌ట ఉమన్), డా.జీబీకే రావు (ప్రగతి రిసోర్ట్స్), డా.కేపీ రెడ్డి (కాసు ప్రసాద్‌రెడ్డి) (మ్యాక్సి విజన్ ఐ హాస్పిటల్),
డా. రఘురామ్ పిళ్లరిశెట్టి (కిమ్స్ ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డయిసిస్), డా. ఏవీ గురవారెడ్డి (కిమ్స్ సన్‌షైన్), రవీందర్‌రెడ్డి కె (జనప్రియ గ్రూప్), గౌతమ్‌రెడ్డి (ఆర్‌ఈ సస్టనెబిలిటీ), దేవేంద్ర సురానా (సురాణ గ్రూప్), భాస్కర్‌రెడ్డి కె (క్రీమ్ లైన్ డెయిరీ ప్రొడక్ట్స్), గుమ్మి రామ్‌రెడ్డి (ఏఆర్‌కే గ్రూప్), ప్రదీప్‌కుమార్‌చౌదరి (ఫ్రీడమ్ ఆయిన్/జీఈఎఫ్ ఇండియా), రవీందర్‌రెడ్డి ఎం (భారతి సిమెంట్), డా. నాగేశ్వర్‌రెడ్డి (ఏఐజీ హాస్పిటల్స్),
పెద్ది రాజు కె (శ్రీకన్య కంఫర్ట్), అనిల్ కుమార్ కె (కెపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్), గురుస్వామి నాయుడు వై (వై గురు) (సెల్‌కాన్ గ్రూప్), చక్రవర్తి (ఏవీపీఎస్ ఎకోబ్లిస్ ఇండియా), ప్రతిభ కుందా (సురేంద్రపురి), డా. వనిత దాట్ల (ఎలికో హెల్త్‌కేర్), డా. లయన్ వై కిరణ్ (సుచిర్ ఇండియా), డా. నరేంద్ర రామ్ నంబుల (లైఫ్ స్పామ్ గ్రూప్), అరవింద్ శ్రీమాల్ (ఫర్చున్ ఆర్ట్), సురేష్ రాయుడు చిత్తూరి (శ్రీనివాస ఫామ్స్), డా. శ్రీనుబాబు గెడెల (పల్సస్ గ్రూప్), కృష్ణమూర్తి ఎస్ (మంగళ గౌరి షాపింగ్ మాల్స్),
మాధవరెడ్డి వై (మైక్) (రోటో మేకర్), డా. శ్రీధర్‌పెద్ది రెడ్డి (రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్), సునీత జి కుమార్ (మా ఈఎన్టీ హాస్పిటల్/ మా రీసర్చ్ ఫౌండేషన్), నిరూప్‌రెడ్డి (ఎన్‌ఏ ఆర్కిటెక్ట్స్), భవాని సురేష్ చారుగుండ్ల (ట్రూజోన్ సోలార్), డా. రాఘవేంద్ర రావు బొండాడ (బొండాడ గ్రూప్), రమణరెడ్డి సీవీ (అను ఫర్నిచర్), డా. ప్రీతిరెడ్డి సీహెచ్ (మల్లారెడ్డి విశ్వ విద్యాపీఠ్), డా. సంగీతరెడ్డి (అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైస్ లిమిటెడ్), విజయేశ్వరి చెరుకూరి (రామోజీ ఫిలింసిటీ),
రాజీవ్ చిలక (గ్రీన్ గోల్డ్ యానిమేషన్), సయ్యద్ ఇర్ఫాన్ (సుభాన్ బేకరీ), డా. లావు రత్తయ్య (విజ్ఞాన్స్ గ్రూప్), పూర్ణచంద్రరావు ఎన్ (రెసోనెన్స్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్), బీఆర్ నాయుడు (టీవీ5) (శ్రేయ బ్రాడ్‌బాండ్ క్యాస్టింగ్ ప్రైవేట్ లి.), పంకజ్ గుప్తా (తిరా బై తిబారుమాల్ జ్యూయల్స్), రాఘవేంద్రరెడ్డి మాచా (డీపీఎస్ ఘట్కేసర్), డా. మధు వరణాసి (సూపర్ స్పెషలిటీ హోమియోపతి క్లినిక్), డా. రమేష్ కంచెర్ల (రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్),
సునీల్‌రెడ్డి డి (దొడ్ల డెయిరీ గ్రూప్), సుబ్బారెడ్డి బీ (వంశీరామ్ బిల్డర్స్), జయదేవ్ మీలా (సుధాకర్ పైప్స్), నవీన్‌గట్టు (గ్రామనర్), డా. శ్రీనివాస్‌రెడ్డి (ఆప్టిమస్ ఫార్మా ప్రై.లి.), రవికుమార్ ఓహ్రి (ఓహ్రీ గ్రూప్ ఆఫ్ హోటల్స్), అపర్ణరెడ్డి (పింకీ రెడ్డి) (జీవీకే/ఎమ్రీ గ్రీన్ హెల్త్ సర్వీసెస్), ఎన్వీఎస్ రెడ్డి (హైదరాబాద్ మెట్రో).