యువకుడి వేధింపులకు మైనర్ బాలిక ఆత్మహత్య

10-10-2026 | 07:36pm

చందుర్తి,(విజయక్రాంతి): మండలంలోని కట్ట లింగంపేట గ్రామానికి(Kattalingampet village) చెందిన 15 ఏళ్ల మైనర్ బాలిక(Teen Girl) గౌతమి యువకుడి వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంది. గత కొంత కాలంగా రుద్రంగి మండలానికి చెందిన యువకుడు తన కుమార్తె వెంటపడుతూ ప్రేమ పేరుతో వేధింపుల(Harassment)కు గురిచేస్తున్నాడనే విషయాన్ని కూతురు తల్లిదండ్రులకు చెప్పగా, గత నెలలో సదరు యువకుడిని తమ కుమార్తె వెంటపడవద్దని హెచ్చరించినప్పటికీ, అతని ప్రవర్తనలో మార్పు రాలేదని, ఫోన్ కాల్స్, ఇన్‌స్టాగ్రామ్(Instagram) ద్వారా తరచూ సందేశాలు పంపుతూ వేధింపులకు గురిచేసేవాడని, ఈ వేధింపుల కారణంగా తీవ్ర మనస్థాపానికి గురైన బాలిక ఉదయం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందనే తల్లిదండ్రుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు  సిఐ రవీందర్ తెలిపారు.

మరిన్ని వార్తలు