పేకాట స్థావరంపై పోలీసుల దాడి
14-11-2026 | 10:48am
పాల్వంచ (విజయక్రాంతి): పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్న సంఘటన పాల్వంచలో(Palvancha Police) శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మున్సిపాలిటీ పరిధిలోని మంచికంటినగర్ ప్రాంతంలోని శివారున కొందరు వ్యక్తులు రహస్యంగా పేకాట ఆడుతున్నారని పక్కా సమాచారం అందుకున్న పాల్వంచ టౌన్ పోలీసులు దాడి(Gambling Den) చేసి పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 6300 నగదు, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ఐదుగురిని టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ ఎస్ఐ నాగరాజు తెలిపారు.