ఇస్లాంపూర్‌లో హత్య.. కొట్టి చంపిన భార్య, కొడుకు

19-09-2026 | 08:56am

తూప్రాన్, సెప్టెంబర్ 19(విజయక్రాంతి): తూప్రాన్ పోలీస్ స్టేషన్(Toopran Police Station) పరిధిలోని ఇస్లాంపూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో హత్య ఘటన చోటుచేసుకుంది. ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన కొండాపురం శ్రీరాములు 50 మృతి చెందాడు, తూప్రాన్ పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, కుటుంబంలో కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నట్లు తెలిసింది. ఘటన జరిగిన సమయంలో మృతుడు మద్యం సేవించి భార్య, పిల్లలతో గొడవపడి వారిపై దాడికి పాల్పడటంతో పాటు గ్యాస్ సిలిండర్‌ లీక్(Gas cylinder leak) చేసి చంపుతానని బెదిరించినట్లు వారు తెలిపారు.

ఈ క్రమంలో జరిగిన ఘర్షణలో భార్య సబిత, కొడుకు భరత్ కర్రతో శ్రీరాములుపై దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలై మృతి చెందినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. సమాచారం అందుకున్న వెంటనే ఎస్‌ఐలు గంగరాజు, జ్యోతి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం తూప్రాన్ డిఎస్పి నరేందర్ గౌడ్(Tupran DSP), సిఐ వెంకటరాజా గౌడ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని  ప్రభుత్వ ఆసుపత్రి తూప్రాన్ మార్చురీకి తరలించారు.జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉండగా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తూప్రాన్ పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు