మృతుల సంఖ్య ఆరుకు
మంచిర్యాల క్రైమ్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) నస్పూర్ గేట్ వద్ద సెప్టెంబరు 28న జరిగిన లారీ, ఆటో ఢీకొన్న(Lorry and auto-rickshaw collide) ప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మందమర్రి మండలం వెంకటాపూర్‌కు చెందిన సల్లూరి అనూష(Salluri Anusha) ఐదు రోజులుగా కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో(Private hospital) చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. దీంతో ప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. ఇప్పటికే ఐదుగురు మహిళలు మృతి చెందగా.. అనూష మృతితో వెంకటాపూర్‌లో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మహిళలు మృత్యువాత పడటం స్థానికులను తీవ్రంగా కలచివేసింది.