మల్టి రెస్టారెంట్ ఆర్డరింగ్ ను ప్రారంభించిన స్విగ్గీ

21-10-2026 | 06:24pm

ముంబై: భారతదేశంలో మొదటి ఆన్-డిమాండ్ కన్వీనియెన్స్ ప్లాట్ ఫాం స్విగ్గీ (స్విగ్గీ లిమిటెడ్, NSE: SWIGGY/BSE: 544285) తమ యాప్ లో మల్టి రెస్టారెంట్ ఆర్డరింగ్(Multi Restaurant Ordering) ప్రారంభం గురించి ప్రకటించింది. ఆహారం అనేది వ్యక్తిగత ఎంపిక మరియు ప్రాధాన్యతలు ఒక నిర్దిష్టమైన కుటుంబం లేదా సమూహంలో మారుతుండవచ్చు. ఎలాంటి రాజీ లేకుండా యూజర్లు తమకు ఇష్టమైన ఆహారం తినడాన్ని నిర్థారించడానికి మల్టి రెస్టారెంట్ ఆర్డరింగ్ రూపొందించబడింది.

ఈ ఫీచర్  వినియోగదారులకు  ఐదు రెస్టారెంట్ల వరకు వివిధ క్యూజిన్ లు, వంటకాలు మరియు తమకు ఇష్టమైన ఆహారాలను కలిపి ఒకేసారి ఆర్డర్ చేసుకునే సదుపాయం కల్పించింది. ఆటంకాలు లేని మరింత నిరంతర అనుభవానికి అదనంగా, మల్టి రెస్టారెండ్ ఆర్డరింగ్ ఫీచర్ వివిధ ప్లాట్ ఫీజుతో వేరుగా కార్ట్స్ మరియు చెక్ అవుట్స్ కోసం చెల్లింపుల అవసరాన్ని తొలగించి యూజర్లకు మరిన్ని ఆదాలను కూడా వాగ్థానం చేసింది.

అది కుటుంబంలో సమావేశాలు కావచ్చు, దీపావళి పార్టీలు కావచ్చు లేదా దీర్ఘకాలం వారాంతాలు కావచ్చు, టేబుల్ వద్ద ప్రతి ఒక్కరికి ఆహారం కోసం  వివిధ ఎంపికలు మరియు ప్రాధాన్యతలు ఉంటాయి. మల్టి రెస్టారెంట్ ఆర్డరింగ్ ఫీచర్ తో, వినియోగదారులు తమకు ఇష్టమైన స్టార్టర్స్ , ప్రధాన భోజనాలు మరియు డిజర్ట్స్ కోసం వివిధ రెస్టారెంట్ల నుండి ఆర్డర్లు చేయవచ్చు. ఈ ఫీచర్  కస్టమర్లు వివిధ కార్ట్స్ ను రూపొందించి, నిలిపి ఉంచడం, పక్కపక్కనే వాటిని పోల్చడం మరియు చెక్ అవుట్స్, OTPలు లేదా చెల్లింపుల ప్రవాహం పునరావృతం కాకుండా ఒకే చెల్లింపుతో అయిదు రెస్టారెంట్ల వరకు కస్టమర్లు తమ ఇళ్ల నుండే ఫుడ్ కోర్ట్ అనుభవాన్ని పొందడానికి  ఆర్డరింగ్ చేయగలిగే సౌకర్యం కల్పిస్తోంది. ప్రతి రెస్టారెంట్ ఆర్డర్ తయారు చేయబడుతుంది మరియు స్వతంత్రంగా డెలివరీ చేయబడుతుంది మరియు ఒక భాగస్వామ్య ట్రాకింగ్ స్క్రీన్ లో తమ సొంత ట్యాబ్ గా చూపించబడుతుంది.

ఈ ప్రారంభం గురించి మాట్లాడుతూ, సిద్ధార్థ్ భాకూ, ఛీఫ్ బిజినెస్ ఆఫీసర్, స్విగ్గీ ఫుడ్ మార్కెట్ ప్లేస్ ఇలా అన్నారు, “ఆహారం అనేది ప్రతి వేడుకకు కీలకం అయితే మెనూని ఆమోదించడం మాత్రం చాలా కష్టమైన విషయం. మేము మీ ఇంటికి అక్షరాలా ఫుడ్ కోర్ట్ భావనను తీసుకువస్తున్నాము. ఉత్తమమైన డైనింగ్ సందిగ్ధానికి మల్టి-రెస్టారెంట్ ఆర్డరింగ్ పరిష్కారం అందిస్తున్నాం. తమకు ఇష్టమైన రెస్టారెంట్ల నుండి మిక్స్ అండ్ మ్యాచ్ చేయడానికి  లేదా వివిధ క్యూజిన్ల నుండి ఆర్డర్ చేయడానికి మేము యూజర్లకు అధికారం ఇస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు