ఎయిమ్స్‌లో అత్యాధునిక వైద్య సేవలు
బీబీనగర్ ఎయిమ్స్ పరిశీలనలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్
హైదరాబాద్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీబీనగర్ ఎయిమ్స్(AIIMS)లో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నట్లు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ(Nizamabad Urban MLA Dhanpal Suryanarayana) తెలిపారు. భువనగిరి జిల్లా బీబీనగర్‌లో గల ఎయిమ్స్‌ను మంగళవారం ఆయన పరిశీలించారు. ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా వైద్య సేవలు అందుతున్నాయని చెప్పారు.
మొత్తం 750 బెడ్లతో నిర్మిస్తున్న ఎయిమ్స్ లో ప్రస్తుతం 260 అందుబాటులో ఉన్నాయన్నారు. మరో ఆరు నెలల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రధానంగా కేవలం పది రూపాయల ఫీజుతో ఏ డాది పాటు ఓపీ పొందవచ్చన్నారు. అలాగే ఇన్ పేషెంట్‌గా అడ్మిట్ అయితే ఒకరోజుకు బెడ్ ఛార్జీ కేవలం రూ.35 తీసుకుంటారన్నా రు. 25 ప్రధాన విభాగాల్లో వైద్యులు, సిబ్బం ది అందుబాటులో ఉన్నారని పేర్కొన్నారు. అవసరమైన వారు సంప్రదించాలన్నారు.