శ్వాసకోశ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు
సీజనల్ ఇన్ఫెక్షన్లతో ఆస్తమా, సీవోపీడీ తీవ్రతరమయ్యే అవకాశం
కామినేని హాస్పిటల్స్ వైద్యులు
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): మాన్‌సూన్ సమయం(Monsoon season)లో అధిక తేమ, ఇళ్లలో తడిగా ఉండే వాతావరణం, శ్వా సకోశ ఇన్ఫెక్షన్లు, అలర్జీ కారకాలకు ఎక్కువగా గురికావడం వల్ల సాధారణంగా కనిపించే దగ్గు, జలుబు లేదా వైరల్ ఇన్ఫెక్షన్ కొన్నిసార్లు తీవ్రమైన శ్వాసకోశ సమస్యలకు దారి తీసే అవకాశం ఉందని కామినేని హాస్పిటల్స్(Kamineni Hospitals) పల్మనాలజీ వైద్యులు హెచ్చరించారు.
ముఖ్యంగా ఆస్తమా, సీవోపీడీ తీవ్రతరమవడం, బ్రాంకైటిస్, వైరల్ ఇన్ఫెక్షన్ తర్వాత తగ్గని దగ్గు, అలర్జీ సంబంధిత శ్వాసకోశ సమస్యలు, న్యూమోనియా వంటి వాటిపై వైద్యపరంగా ఆందోళనలు పెరుగుతున్నాయని, అధిక ప్రమాదం ఉన్న వ్యక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కామినేని హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ సుభాకర్ కంది మాట్లాడుతూ మాన్‌సూన్ పరిస్థి తులు ఆస్తమా, సీవీపీడీ వంటి ఇప్పటికే ఉ న్న శ్వాసనాళ సంబంధిత వ్యాధులను మరింత తీవ్రతరం చేయవచ్చన్నారు.
ప్రారంభ దశలోనే వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా నియంత్రించగలిగే సమస్య తీవ్రమైన శ్వాసకోశ సమస్యగా మారకుండా నివారించవచ్చునని తెలిపారు. సీనియర్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ ఈ. రవీంద్రరెడ్డి మాట్లాడుతూ వైరల్ ఇన్ఫెక్షన్ తర్వాత కొనసాగుతున్న దగ్గును ఎప్పుడూ సాధారణ బ్రాంకైటిస్ గా భావించకూడదన్నారు. స్పష్టమైన వైద్య అవసరం లేనప్పుడు అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడకూడదు అని చెప్పారు.
మరో సీనియర్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ.. శ్వాసకోశ సమస్యలకు సంబంధించిన ప్రమాద సంకేతాలను గుర్తించడం, అధిక ప్రమాదంలో ఉన్నవారిని కాపాడుకోవడం చాలా ముఖ్యమ న్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు, ఆస్తమా, సీవీపీడీ, గుండె సంబంధిత వ్యాధులు లేదా ఇత ర దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్నవారు మాన్‌సూన్ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. వెంటనే వైద్య సహాయం పొందాలి అని సూచించారు.
కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ డీఎస్ సౌజన్య మాట్లాడుతూ వైద్యులు సూచించిన ఇన్‌హెలర్లు, మందులను సూచించిన విధంగానే కొనసాగించాలి. సకాలంలో వైద్యులను సంప్రదించ డం ద్వారా సమస్య తీవ్రతరం కావడాన్ని మొదట్లోనే గుర్తించి, మరింత క్షీణించకుండా నివారించవచ్చునన్నారు. కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ భరత్ జానపాటి వైద్య పరీక్షల ద్వారా శ్వాసకోశ లక్షణాలు ఇన్ఫెక్షన్, శ్వాసనాళ సంబంధిత వ్యాధి లేదా ఇతర శ్వాస కోశ సమస్య వల్ల కలుగుతున్నాయా అనేది గుర్తించి, చికిత్స అందించవచ్చునన్నారు.