నిజామాబాద్ మెడికవర్‌లో న్యూరో సేవలు

09-09-2026 | 05:25am

మెదడు, నరాల వ్యాధులకు ఇక మెరుగైన వైద్యం

హైదరాబాద్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): మెదడు, నరాల సంబంధిత వ్యాధులకు అత్యాధునిక వైద్య సేవలను అందించేందుకు మెడికవర్(Medicover) హాస్పిటల్స్ నిజామాబాద్ ప్రత్యేక న్యూరో సేవల(Neuro Services)ను అందుబాటులోకి తీసుకువచ్చింది. న్యూరో సర్జన్ డా. శ్రీకృష్ణాదిత్య, న్యూరో ఫిజిషియన్ డా. మొహసీన్ ఆధ్వర్యంలో మెదడు, వెన్నుపాము, నరాల సంబంధిత వివిధ సమస్యలకు ఆధునిక వైద్య విధానాలతో చికిత్స అందిస్తున్నారు.

బ్రెయిన్ స్ట్రోక్, మెదడులో రక్తస్రావం, బ్రెయిన్ ట్యూమర్స్, అన్యూరిజమ్స్, మూర్ఛ, తీవ్రమైన తలనొప్పి, తల తిరగడం, చేతులు లేదా కాళ్లలో బలహీనత, నరాల నొప్పులు, వెన్నుపాము సంబంధిత సమస్యలు తదితర వ్యాధులకు అవసరమైన నిర్ధారణ, వైద్య చికిత్స మరియు శచికిత్స సేవలు అందుబాటులో ఉన్నాయని వైద్యులు తెలిపారు.

స్ట్రోక్ వచ్చిన సమయంలో ముఖం ఒక వైపుకు వంగడం, ఒక చేయి లేదా కాలు బలహీనపడటం, మాట తడబడటం లేదా అర్థం కాక పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి తీసుకురావాలని డా. శ్రీకృష్ణాదిత్య, డా. మొహసీన్ సూచించారు. మెడికవర్ హాస్పిటల్స్ నిజామాబాద్‌లో న్యూరో సంబంధిత అత్యవసర పరిస్థితులకు అవసరమైన ఆధునిక వైద్య సదుపాయాలు, డయాగ్నస్టిక్ సేవలు, క్రిటికల్ కేర్, నిపుణుల వైద్య బృందం అందుబాటులో ఉన్నాయని ఆసుపత్రి యాజమాన్యం పేర్కొంది.

మరిన్ని వార్తలు