డోర్ డెలివరీ మీ సేవలకు ఫుల్ గిరాకీ

24-10-2026 | 05:00am
  1. ఇంటి వద్దకే వివిధ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ సేవలు 
  2. ప్రారంభించిన నెల రోజుల్లోనే మంచి స్పందన
  3. 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా 3,885 కాల్స్

హైదరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు(Minister Duddilla Sridhar Babu) దార్శనిక నాయకత్వంలో ప్రజలకు మరింత సౌకర్యవంతమైన, పారదర్శకమైన సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేలా ‘మీ సేవ’ వ్యవస్థను ప్రభుత్వం మరింత బలోపేతం చేస్తోంది.

ప్రజలు ఇకపై ఆదాయ, కులం, నివాసం, జననమరణ ధ్రువీకరణ పత్రాలతోపాటు ఆధార్ నమోదు, ఆధార్ వివరాల అప్ డేట్ వంటి పలు సేవలను తమ ఇంటి వద్దనే పొందవచ్చు. ఇందు కోసం మీ సేవ కేంద్రాలు(Meeseva Center) లేదా ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, క్యూలో వేచి ఉండకుండా మీ సేవ డోర్ స్టెప్ డెలివరీ సేవలను పొందే అవకాశం కల్పించారు. ప్రజలు టోల్‌ఫ్రీ నంబర్ 1100కు కాల్ చేయడం, మీ సేవ పౌరుల పోర్టల్ ద్వారా అభ్యర్థన నమోదు చేయడం ద్వారా ఈ సేవలను పొందవచ్చు. ఆ తర్వాత మీ సేవ ప్రతినిధి నిర్ణీత సమయంలో ఇంటికి వచ్చి అవసరమైన సేవను అందిస్తారు.

ఈ సేవ ప్రారంభమైన మొదటి నెలలోనే 1100 టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్‌కు ప్రజల నుంచి 3,885 కాల్స్ వచ్చాయని ఎలక్ట్రానిక్ సర్వీసెస్ డెలివరీ(ఈఎస్‌డీ) కమిషనర్ తెలిపారు. ప్రజ లకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడం, పారదర్శకమైన పాలన అందించడం లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన  ఈ కా ర్యక్రమం ఒక భాగమని పేర్కొన్నారు. ప్రస్తు తం ఈ డోర్ స్టెప్ సేవలు క్యూర్ పరిధిలోని ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉ న్నాయి. బుక్ చేసుకున్న సర్వీస్ ప్రకారం వర్తించే సేవా రుసుములు చెల్లించాల్సి ఉంటుంది.   

డోర్ స్టెప్ సేవలు ఇలా..

*టోల్ ఫ్రీ నంబర్ 1100కు కాల్ చేయాలి. లేదా మీ సేవ పౌరుల పోర్టల్ ద్వారా అభ్యర్థన నమోదు చేయాలి.

*అవసరమైన ధ్రువీకరణ పత్రం లేదా ఆధార్ సేవను ఎంచుకుని, కాల్ సెంటర్ ప్రతినిధికి అవసరమైన వివరాలను అందించాలి.

*నిర్ణయించిన సమయంలో మీ సేవ డోర్ స్టెప్ ప్రతినిధి మీ ఇంటికి వచ్చి అవసరమైన సేవను అందిస్తారు.

మరిన్ని వార్తలు