పాత జ్ఞాపకాలు.. మళ్లీ ఒక్కచోటకు పూర్వ విద్యార్థినులు!
గణపురం, అక్టోబర్ 24 (విజయ క్రాంతి): గణపురం మండలంలోని ధర్మారావుపేట గ్రామంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం(Alumni Reunion) శనివారం ఆత్మీయంగా జరిగింది. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఒకే పాఠశాలలో కలిసి చదువుకున్న పూర్వ విద్యార్థినులు తిరిగి తమ పాఠశాలకు చేరుకుని సందడి చేశారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమాలు(Special Events) నిర్వహించి, చిన్ననాటి మధుర జ్ఞాపకాలను ఒకరితో ఒకరు పంచుకున్నారు. ఎన్నో సంవత్సరాల తర్వాత కలుసుకోవడంతో పూర్వ విద్యార్థినుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. పాత మిత్రులను కలుసుకోవడం, నాటి అనుభవాలను గుర్తుచేసుకోవడం ద్వారా ఆత్మీయతను చాటుకున్నారు.ఈ
కార్యక్రమానికి గణపురం(Ganapuram) మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కటుకూరి రాధిక(Sarpanch Katukuri Radhika) శ్రీనివాస్ పాల్గొని పూర్వ విద్యార్థులను అభినందించారు. విద్యార్థి దశలో ఏర్పడిన స్నేహబంధాలు జీవితాంతం కొనసాగుతాయని, ఇటువంటి సమ్మేళనాలు పాత జ్ఞాపకాలను పదిలపరచడంతో పాటు నేటి తరానికి స్ఫూర్తినిస్తాయని అన్నారు.పూర్వ విద్యార్థుల సమ్మేళనం సందర్భంగా పాఠశాల ప్రాంగణం సందడి వాతావరణాన్ని సంతరించుకుంది.