వితంతువులకు గుడ్ న్యూస్.. మళ్లీ షురూ

24-10-2026 | 01:40pm

గణపురం, అక్టోబర్ 24 (విజయ క్రాంతి): పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని గణపురం సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ అన్నారు. గతంలో వివిధ కారణాలతో భర్తలను కోల్పోయిన మహిళలకు వితంతు పింఛన్లను (Widow Pensions) శనివారం ఆమె పంపిణీ చేశారు. ప్రభుత్వం తిరిగి పింఛన్ల సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావడంపై లబ్ధిదారులు (Beneficiaries) హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల (Welfare Schemes) ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. పింఛన్ల ద్వారా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక భరోసా (Financial Security) కల్పిస్తున్నట్లు తెలిపారు. గతంలో నిలిచిపోయిన పింఛన్లను అర్హులైన వారికి తిరిగి అందించడం ప్రభుత్వ సంక్షేమ పాలనకు (Welfare Governance) నిదర్శనమని పేర్కొన్నారు.

తిరిగి పింఛన్ డబ్బులు అందుకోవడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు (Gratitude) తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒల్లాల కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు