గ్రాడ్యుయేట్స్ అలర్ట్.. నవంబర్ 6లోగా ఓటు నమోదు
గణపురం, అక్టోబర్ 24 (విజయ క్రాంతి): త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల (Graduate MLC Elections) నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని కోఆర్డినేటర్లు (Coordinators) బోనాల రాజమౌళి, దూలం కుమారస్వామి పిలుపునిచ్చారు. శనివారం గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్‌తో కలిసి ఓటరు నమోదు అవగాహన కరపత్రాలను (Awareness Pamphlets) ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆదివారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఫారం-18 (Form-18) ఓటరు నమోదు సహాయ శిబిరం (Registration Assistance Camp) నిర్వహించనున్నట్లు తెలిపారు. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసినవారు సైతం ఈసారి తప్పనిసరిగా కొత్తగా దరఖాస్తు (Fresh Application) చేసుకోవాలని సూచించారు.
నవంబర్ 6 వరకు గడువు (Deadline) ఉన్నందున అర్హులైన పట్టభద్రులు తమ డిగ్రీ ధ్రువపత్రం (Degree Certificate), ఆధార్ కార్డు (Aadhaar Card), ఫొటోలతో శిబిరానికి హాజరై ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు.