ఆకాశంలో మృత్యుఘోష (వైరల్ వీడియో)

24-10-2026 | 01:52pm

లిప్పీన్స్‌లో ఘోర విమాన ప్రమాదం.. నలుగురు పైలట్లు మృతి

మనీలా : ఫిలిప్పీన్స్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శిక్షణలో భాగంగా గాల్లో ప్రయాణిస్తున్న రెండు సైనిక విమానాలు ప్రమాదానికి గురికావడంతో నలుగురు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. మనీలా నగరానికి దక్షిణంగా ఉన్న Fernando Air Base వద్ద శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. ఫిలిప్పీన్స్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన SF-260 Single-Propeller Aircraftలు ప్రమాదానికి గురైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.

ఫిలిప్పీన్స్ ఎయిర్‌ఫోర్స్(Philippine Air Force) అధికార ప్రతినిధి కల్నల్ ఆల్విన్ కాపింగుయాన్ తెలిపిన వివరాల ప్రకారం.. రెండు విమానాలు ఎయిర్‌బేస్(Airbase) పరిధిలోనే కూలిపోయాయి. ఈ ప్రమాదంలో పైలట్లు మినహా ఇతరులకు ఎలాంటి గాయాలు లేదా ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నారు. ప్రమాదానికి అసలు కారణమేంటో తెలుసుకునేందుకు అధికారులు Investigation ప్రారంభించారు. ముందస్తు జాగ్రత్త చర్యగా SF-260 విమానాల ఫ్లీట్‌ను తాత్కాలికంగా Grounded చేసినట్లు ఎయిర్‌ఫోర్స్ ప్రకటించింది.

ఫిలిప్పీన్స్‌లో సైనిక విమానాల ప్రమాదాలు గతంలోనూ ప్రాణనష్టానికి దారితీశాయి. ఈ ఏడాది మే నెలలో ఉత్తర ఫిలిప్పీన్స్‌లోని బెంగ్వెట్ ప్రావిన్స్‌లో శిక్షణ సమయంలో మరో SF-260 విమానం కూలిపోవడంతో ఇద్దరు సైనిక పైలట్లు మరణించారు. వరుస ప్రమాదాల నేపథ్యంలో తాజా ఘటనపై విచారణ ప్రాధాన్యం సంతరించుకుంది. విమానాల సాంకేతిక పరిస్థితి, శిక్షణ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలపై దర్యాప్తులో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


మరిన్ని వార్తలు