బంగారం, వెండికి మళ్లీ రెక్కలు.. హైదరాబాద్‌లో ఇలా

08-09-2026 | 12:48pm

పశ్చిమాసియా ఉద్రిక్తతలు, అంతర్జాతీయ పరిణామాలతో దేశీయ మార్కెట్‌లో బంగారం(Gold), వెండి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. పండగ సీజన్‌ నేపథ్యంలో కొనుగోళ్లు పెరగడం, డాలర్‌ బలహీనపడటం, పెట్టుబడిదారులు పసిడిపై ఆసక్తి చూపడం ఇందుకు కారణాలుగా ఉన్నాయి. మంగళవారం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,54,080గా నమోదైంది. హైదరాబాద్‌లో 24 క్యారెట్లు రూ.1,54,170, 22 క్యారెట్లు రూ.1,41,323, వెండి కిలో రూ.2,40,430గా ఉన్నాయి.


మరిన్ని వార్తలు