సేవా సంకల్ప యాత్రకు ముద్రగడ వంశీ ఘన స్వాగతం

03-10-2026 | 04:54pm

ఇల్లెందు టౌన్,(విజయక్రాంతి): తిరుపతి నుంచి వారణాసి వరకు సుమారు 100 బైకులతో కొనసాగుతున్న సేవా సంకల్ప యాత్ర(Seva Sankalpa Yatra)కు టీడీపీ(TDP) నియోజకవర్గ నేత ముద్రగడ వంశీ ఆధ్వర్యంలో ఇల్లెందులో ఘన స్వాగతం పలికారు. ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా 25 ఏళ్ల ప్రజా ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా, నారా లోకేష్ పిలుపు మేరకు ఎస్‌ఏఏపీ రవి నాయుడు, టీఎన్‌ఎస్‌ఎఫ్, వీఎంఆర్‌డీఏ ప్రణయ్ గోపాల్ ఆధ్వర్యంలో ఈ యాత్ర చేపట్టారు.

భద్రాచలం దర్శనం అనంతరం ఇల్లెందుకు చేరుకున్న యాత్ర బృందానికి ముద్రగడ వంశీ స్వాగతం పలికి యాత్ర లక్ష్యాలను అభినందించారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానం పూర్తి చేసుకోవడం ఆనందదాయకమన్నారు. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. భవిష్యత్తులో ఏపీ మరింత అభివృద్ధి సాధిస్తుందని, తెలంగాణలోనూ తెలుగుదేశం పార్టీ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.

తిరుపతి నుంచి వారణాసి వరకు ఇంత పెద్దఎత్తున సంకల్ప యాత్ర చేపట్టిన రవి నాయుడు, ప్రణయ్ గోపాల్‌ను ముద్రగడ వంశీ అభినందించారు. కార్యక్రమంలో విజయవాడ కనకదుర్గ ఆలయ బోర్డు సభ్యుడు హరి, తెలుగుయువత మాజీ రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు జయరాం, విజయలక్ష్మి నగర్ సర్పంచ్ చాందావత్ రమేష్ బాబు, వార్డు సభ్యుడు మనుబోతుల అఖిల్, టీఎన్‌ఎస్‌ఎఫ్ పట్టణ అధ్యక్షుడు దాసరి గోపాలకృష్ణ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు