కాంట్రాక్టు కార్మికుల ఖాతాల్లో లాభాల వాటా జమ చేయాలి
ఇల్లెందు టౌన్,(విజయక్రాంతి): సింగరేణి కాంట్రాక్టు కార్మికుల(Singareni Contract Workers)కు 2024-25 సంవత్సరానికి ప్రకటించిన రూ.5 వేల లాభాల వాటాను వెంటనే ఖాతాల్లో జమ చేయాలని ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ (PSCWWU-TUCI) రాష్ట్ర అధ్యక్షుడు షేక్ యాకుబ్ షావలి, జిల్లా సహాయ కార్యదర్శి బానోతు రామ్ సింగ్ డిమాండ్ చేశారు.
శనివారం ఇల్లెందు ఎస్ఓటు జీఎం జాకీర్ హుస్సేన్కు వినతిపత్రం అందజేశారు. జీఎస్టీ(GST) కారణంగా కాంట్రాక్టర్లు నగదు జమ చేయడం లేదని, పర్మినెంట్ కార్మికులకు బోనస్ అందినా కాంట్రాక్టు కార్మికులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సమస్య పరిష్కరించకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మేకల శీను తదితరులు పాల్గొన్నారు.