ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను వెంటనే తొలగించాలి
పిట్టల అర్జున్ డిమాండ్
దమ్మపేట, అక్టోబర్ 23(విజయక్రాంతి): ఎన్నికల సంఘాన్ని(Election Commission) స్వతంత్రంగా నిర్వహించకుండా ఎన్నికల వ్యవస్థను బ్రష్టు పట్టించిన ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్(Chief Election Commissioner Gyanesh Kumar) ను బాధ్యతల నుంచి తొలగించాలని, ఎస్ ఐ ఆర్ ను రద్దు చేయాలని సిఐటియు, ఏఐకేఎస్ టియుసిఐ నాయకులు(Leaders of CITU, AIKS, and TUCI) పిట్టల అర్జున్, దొడ్డ లక్ష్మీనారాయణ, పండూరి వీరబాబు డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ను వెంటనే విధుల నుండి తొలగించాలని కోరుతూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో దమ్మపేట సెంటర్లో ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం సర్ ప్రోగ్రాం పేరుతో ఫామ్ సిక్స్ లో అనేక మార్పులు చేసి 14 కోట్ల ఓట్లను తొలగించారని ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని అన్నారు. సర్ ప్రోగ్రాం లో మతం ఆధారంగా ఓట్లను తొలగించే కార్యక్రమం చేస్తుందని విమర్శించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కై ప్రజాసంఘాలు, మేధావులు ఐక్యంగా ఉద్యమాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.
జ్ఞానేష్ కుమార్ తక్షణం ఆ పదవి నుంచి తొలగించడంతోపాటు ఎస్ ఐ ఆర్ ను రద్దు చేయాలని ఎన్నికల సంఘాన్ని సమూలంగా సంస్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు మోరంపూడి శ్రీనివాసరావు, సిఐటియు మండల కన్వీనర్ మురహరి రఘు, కొప్పుల శ్రీను, కౌలూరి రామకృష్ణ, బాబురావు, పద్మ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.