ఈదురుగాలులకు నేలవాలిన పత్తి

24-09-2026 | 06:46pm

250–300 ఎకరాల్లో పంటకు నష్టం.. పరిశీలించిన వ్యవసాయాధికారులు

బూర్గంపాడు,(విజయక్రాంతి): మండలంలోని వేపలగడ్డ, కొమ్మునకిరిపేట, మోరంపల్లిబంజర్‌, బుడ్డగూడెం గ్రామాల్లో బుధవారం సాయంత్రం వీచిన బలమైన ఈదురుగాలులకు సుమారు 250–300 ఎకరాల్లో పత్తి పంట(Cotton crop) నేలవాలింది. అంజనాపురం తదితర గ్రామాలకు చెందిన 50–60 మంది రైతుల పంట కాయదశకు చేరుకునే సమయంలో దెబ్బతినడంతో ఆందోళన చెందుతున్నారు.

సమాచారం తెలుసుకున్న మండల వ్యవసాయాధికారి శంకర్‌ గురువారం ఏఈవో వైష్ణవితో కలిసి వేపలగడ్డ, కొమ్మునకిరిపేట గ్రామాల్లో నేలవాలిన పత్తి పంటను పరిశీలించారు. నష్టంపై ప్రభుత్వానికి నివేదిక పంపించి రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ బట్టా విజయ్‌గాంధీ, వేపలగడ్డ సర్పంచ్ నిరోషా, ఉపసర్పంచ్ రాములమ్మ, స్థానిక నాయకులు, రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు