ఆదర్శ ఉపాధ్యాయుడు చింతా రామ్మోహన్‌కు ఘన సన్మానం

31-10-2026 | 05:22pm

చర్ల (రాళ్లగూడెం),(విజయక్రాంతి): చర్ల మండలం(Charla Mandal) రాళ్లగూడెం గ్రామంలో శనివారం ఆదర్శ ఉపాధ్యాయుడు చింతా రామ్మోహన్ రావు(Chinta Rammohan Rao) పదవీ విరమణ(Retirement) సన్మాన సభ ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిన ఆయన సేవలను గ్రామస్తులు, విద్యార్థులు, తోటి ఉపాధ్యాయులు కొనియాడారు.

రామ్మోహన్ రావు 1965 అక్టోబర్ 14న జన్మించారు. 1వ తరగతి నుండి ఇంటర్ వరకు చర్లలో, ఉన్నత విద్య ఖమ్మంలో పూర్తి చేశారు. 1989 జులై 19న ఏటూరు నాగారం మండలం కిష్టాపురం పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి, అనంతరం చర్ల మండలంలోని పలు పాఠశాలల్లో సేవలందించారు. చివరగా రాళ్లగూడెం పాఠశాల నుండి అక్టోబర్ 31న పదవీ విరమణ పొందారు.

తన 37 ఏళ్ల సుదీర్ఘ సేవా ప్రస్థానంలో విద్యా బోధనకే పరిమితం కాకుండా సామాజిక సేవలోనూ ముందున్నారు. ముఖ్యంగా 2006-07 గోదావరి వరదల సమయంలో బాధితులకు అండగా నిలిచి చేసిన సేవలు చిరస్మరణీయం. ఆయన సేవలకు గుర్తింపుగా 2019లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, 2022లో మండల ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. 

అనంతరం వక్తలు మాట్లాడుతూ రామ్మోహన్ రావు విద్యార్థుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని, ఆయన సేవలు ఆదర్శనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు