విఘ్నేశ్వరుడిని దర్శించుకున్న బి.ఆర్.ఎస్. పార్టీ జిల్లా నాయకులు
24-09-2026 | 06:02pm
దమ్మపేట, సెప్టెంబర్ 24(విజయ క్రాంతి): మండల పరిధిలోని వెంకటద్రిగూడెం లో(Venkatadrigudem) వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గణేష్ మండపాన్ని బి ఆర్ ఎస్ నాయకులు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను అభినందించారు. వినాయకుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చవ్వా అయ్యప్ప, ఎలికె.శ్రీను, లోకేష్, కోటేశ్వరరావు, సోయం ఎర్రయ్య, బుద్దుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.