పంచ జన్య సంకల్ప సభను విజయవంతం చేయండి

25-10-2026 | 04:30pm

* పోస్టర్లు విడుదల చేసిన టిఆర్ఎస్ నాయకులు..

ఉట్నూర్, అక్టోబర్ 25( విజయక్రాంతి): ఈనెల 30న ఇంద్రవెల్లిలో(Indravelly) తెలంగాణ రక్షణ సేన(Telangana Rakshana Sena) నిర్వహించ తలపెట్టిన భారీ పాంచ జన్య సంకల్ప సభకు సంబంధించిన గోడ ప్రతులను ఆదివారం ఉట్నూర్(Utnoor) లో  ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగు మల్లారెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు  చాడ అలేఖ్య రెడ్డి,  నిర్మల్ జిల్లా అధ్యక్షుడులోకిని రాము, ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ మేస్త్రం దయాకర్ లు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఉచితవిద్య, ఉచిత వైద్యం, ఉపాధి, వ్యవసాయం సామాజిక న్యాయం తెలంగాణ రక్షణ సేన మూల సిద్ధాంతమన్నారు.

ప్రొఫెసర్ జయశంకర్(Professor Jayashankar) సార్ ఆలోచనలు ఆశయాగా మేరకు టిఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) టిఆర్ఎస్ ను ప్రజల్లోకి తీసుకు వెళుతున్నారాని చెప్పారు. సబ్బండ వర్గాల సంక్షేమం అభివృద్ధి మా పార్టీ నినాదమని, సామాజిక న్యాయం కోసం తెలంగాణ న్యాయ సంకల్ప సభలు నిర్వహిస్తూ ఉన్నామని,

అందరికీ సమాన అవకాశాలు సమాన హక్కులు అందాల అన్నదే మా పార్టీ అధినేత్రి కవిత లక్ష్యమని, పోరాటాల గడ్డ ఆదివాసి బిడ్డల పౌరుషానికి పోరాట ప్రతిమకు   నిదర్శనమైన ఇంద్రవెల్లి స్తూపం దగ్గర టిఆర్ఎస్ పాంచ జన్య సంకల్ప సభను నిర్వహిస్తున్నామన్నారు.పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆదివాసీల సంక్షేమం కేవలం కాగితాలకే పరిమితం అయిపోయిందని విమర్శించారు. ఇప్పటికీ సరైన రోడ్డు సౌకర్యాలు లేవు తాగునీటికి ఆదివాసి బిడ్డలు అల్లాడుతున్నారని దుయ్యబట్టారు.

 ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా నాయకులు బోర్లకుంట రాజేష్, వేడుమా విట్టల్, సంజీవ్ నాయక్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు