పంటవ్యర్థాలను కాల్చవద్దు
ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలి
బోథ్,(విజయక్రాంతి): పంట భూముల్లో పంట వ్యర్థాలను కాల్చివేయవద్దని(Avoid Crop Burning) సొనాలా ఎంపీడీవో రత్నాకర్ రావు(Sonala MPDO Ratnakar Rao) పేర్కొన్నారు. శనివారం ఎంపీడీవో కార్యాలయంలో గ్రామాల కార్యదర్శిలు ఉపాధి హామీ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట వ్యర్థాలను కాల్చివేయడం వల్ల వాతావరణ కాలుష్యం కావడంతో పాటు ప్రజలకు ఇబ్బందికరంగా మారుతుంది అన్నారు.
అయితే ఈ విషయంలో రైతులకు అవగాహన కల్పించాలని గ్రామాల కార్యదర్శులకు సూచించారు. అంతేగాక ఇంకుడు గుంతలను ఇంటింటికి నిర్మించుకునేలా చూడాలన్నారు. నీది ఎద్దడిని తట్టుకునేందుకు అన్ని గ్రామాలలో ఫారం ఫండ్స్ నిర్మాణం చేపట్టే విధంగా ఉపాధి హామీ సిబ్బంది రైతులను ప్రోత్సహించాలన్నారు.